ఈ కథలు దేవవాణిలో ప్రదీప్ నాథ్ గారి చేత అస్సామీ లేదా బెంగాలీ భాషనుండి మరియు శ్రీ శ్రీనిధి అభయంకర్ గారిచేత కన్నడనుండి అనువదింపబడుతున్నవి. కొన్ని స్వయంగా రచింపబడుతున్నాయి. ఈ లేఖకు తెలుగు అనువాదాల గురించి ఓ చిన్న మాట--
ఇది మీకు నచ్చకపోవచ్చు కానీ తప్పకుండా ఉపయుక్తంగా ఉంటుంది. ఇందులో తెలుగును తెలుగు అనలేము. అది సంస్కృతం ప్రకారం మలచిన తెలుగు. దీని గురించి బాధకలిగిన తరువాత, ఆ చిరాకు మెట్టు దాటాక సంస్కృతార్థం ఎంత ఉపయుక్తంగా ఉన్నదో తెలుస్తుంది. దాదాపు ఆయా సంస్కృత పదాలను అదే క్రమంలో ఉంచి చేస్తున్న పని. పదజ్ఞానం కోసం, వాక్యజ్ఞానం కోసం, ఆ వాక్యనిర్మితిని సంస్కృతంలోనే అనుభూతి చెందాలనే తాపత్రయంతో చేస్తున్న పని. ఇది కథే అయినా, వాక్యబృందం (పేరా)గా ఉండాల్సిన అవసరం ఉన్నా, సంస్కృతార్థుల లాభం దృష్ట్యా వీటిని సంస్కృతమూలం, తెలుగు అర్థం అని విభజించి, రెంటికీ ఒకే సంఖ్యను ఇచ్చాము. దీనివల్ల రెండు లాభాలు. ఒక భాషలో, ఒకసారిలోనే ఒకే కథగా చదువుకోవచ్చు. వెంటనే తెలుగు ఉండదు కనుక అనువాదం ఊహించుకోవచ్చు. అభ్యాసానికి కూడా ఇది ఉపయుక్తం. మళ్ళీ తెలుగు అర్థం చదువుకునే వేళ ఓసారి సంస్కృతాన్ని గమనిస్తూ చదివితే పదాల క్రమం కూడా దాదాపుగా సమానంగా పాటించే ప్రయోగం జరిగినందున ఊహించుకునేందుకు, అనువాదం చేసుకునేందుకు లాభం కలుగుతుంది.
చదివి విషయం తెలుసుకునేందుకో, ఆనందించేందుకో వాడే భాష వేరు. నేర్చుకునేందుకు వాడే భాష వేరు. చక్కగా అందమైన తెలుగులోకి అనువాదం చేయలేక కాదు. ఇట్లా దేవవాణి ప్రకారం ‘చెడ’గొట్టేసి చేస్తే తెలుగుప్రియులు హర్షించకపోవచ్చు. కానీ అందువల్ల సంస్కృతార్థులకు లాభం ఎంత జరుగుతుందో కొలిచి చెప్పటం కష్టం. చెడగొట్టినదానిలో కూడా వీలైనంత అందంగా ఉంచే ప్రయత్నం జరిగింది.
ఈ కార్యాన్ని సంయోజనం చేసి, బ్లాగ్ సహాకారం అందించిన మా అమ్మాయి చి.ల.సౌ. సంకా ఉషారాణికి ఆశీస్సులు.
దీనికి ప్రతిస్పందన చాలా అవసరం. పాఠకులు దయచేసి తమ విద్యార్థులపై లేదా స్వయంపై ప్రయోగించుకుని మీ స్పందనను విమర్శల రూపంలో తెలియజేయవలసింది.
ఇట్లు-
పులిపాక వేంకట లక్ష్మీకాంతారావు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి